ETV Bharat / state

కాగజ్​నగర్​లో సదరం శిబిరం

కుమురంభీం జిల్లా కాగజ్​నగర్​లో వినికిడి లోపం ఉన్న దివ్యాంగులకు సదరం శిబిరాన్ని ఏర్పాటు చేశారు. జిల్లా వైద్యాధికారి కుమురం బాలు శిబిరాన్ని పరిశీలించారు.

sadaram camp for def people at kagaz nagar in kumurambheem district
కాగజ్​నగర్​లో సదరం శిబిరం నిర్వహణ
author img

By

Published : Jul 7, 2020, 10:17 PM IST

కుమురం భీం జిల్లా కాగజ్ నగర్ పట్టణంలో సదరం శిబిరం నిర్వహించారు. వినికిడి లోపం ఉన్న దివ్యాంగులకు కాగజ్​నగర్ పట్టణంలోని సర్ సిల్క్ కాలనీలోని పట్టణ ఆరోగ్య కేంద్రంలో సదరం శిబిరం ఏర్పాటు చేసి పరీక్షలు చేశారు.

మొదట అసిఫాబాద్​లో నిర్వహిస్తున్నట్లు తెలిపినప్పటికీ దివ్యాంగుల సౌకర్యార్థం కాగజ్​నగర్​లో ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ శిబిరంలో 65 మంది దివ్యాంగులకు పరీక్షలు నిర్వహించనుండగా 40 రెన్యువల్, 25 కొత్తవారికి స్లాట్లు కేటాయించినట్లు తెలిపారు. జిల్లా వైద్యాధికారి కుమురం బాలు శిబిరాన్ని సందర్శించి ఏర్పాట్లను సమీక్షించారు.

ఇదీ చూడండి: సైన్యంలో మహిళా కమిషన్ ఏర్పాటుకు మరో నెల గడువు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.