కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలో గ్రామీణ పోలీసుల ఆధ్వర్యంలో వాహన చోదకులకు రహదారి భద్రత అవగాహన సదస్సు నిర్వహించారు. స్థానిక సంతోష్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి డీఎస్పీ స్వామి, గ్రామీణ సీఐ. నరేందర్, ఎస్.ఐ. రాజ్ కుమార్లు హాజరయ్యారు.
రహదారి భద్రత మన అందరి బాధ్యతని డీఎస్పీ స్వామి అన్నారు. జాగ్రత్తగా వాహనాలు నడిపి రహదారి ప్రమాదాల నివారణలో మన వంతు పాత్ర పోషించాలని సూచించారు.
ఇవీ చూడండి: పోలీస్ స్టేషన్లో గాజుముక్కలు మింగి ఆత్మహత్యాయత్నం