కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో 72వ గణతంత్ర దినోత్సవం నిరాడంబరంగా నిర్వహించారు. విధుల్లో అత్యుత్తమ ప్రతిభను కనబరిచిన ఉద్యోగులకు అవార్డులు ప్రదానం చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పాలనాధికారి రాహుల్ రాజ్, అడిషనల్ ఎస్పీ సుధీంద్ర, జడ్పీ ఛైర్పర్సన్ కోవ లక్ష్మి, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: కొత్త సచివాలయ పనులను పరిశీలించిన సీఎం