ETV Bharat / state

60 క్వింటాళ్ల రేషన్​ బియ్యం స్వాధీనం... ఒక వ్యక్తి అరెస్టు - కాగజ్​నగర్​లో రేషన్​బియ్యం స్వాధీనం

ఓఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన 60 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని కుమురంభీం జిల్లా కాగజ్​నగర్​ పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసులో ఒకరిని అదుపులోకి తీసుకుని విచారణ చేపడుతున్నట్టు తెలిపారు.

ration-rice-seized-at-kagaznagar-in-kumurambheem-district
60 క్వింటాళ్ల రేషన్​ బియ్యం స్వాధీనం... ఒక వ్యక్తి అరెస్టు
author img

By

Published : Oct 13, 2020, 7:33 PM IST

కుమురంభీం జిల్లా కాగజ్​నగర్ పట్టణంలోని ఒక ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. పట్టణంలోని సంఘం బస్తీలోని ఓ ఇంట్లో భారీ ఎత్తున రాయితీ బియ్యం నిల్వ ఉంచారన్న విశ్వసనీయ సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ పోలీసులు సోదాలు చేపట్టారు.

ఈ తనిఖీల్లో మహారాష్ట్రకు తరలించేందుకు సిద్ధంగా ఉన్న సుమారు 60 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనపర్చుకున్నారు. ఈమేరకు మహమ్మద్ అనే వ్యక్తిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

ఇదీ చూడండి: 'జీహెచ్​ఎంసీ చట్ట సవరణ బిల్లును స్వాగతిస్తున్నా'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.