Barking Deer: తెలంగాణలో 15 ఏళ్లుగా పత్తాలేని జింక జాతుల్లో ఒకటైన బార్కింగ్ డీర్.. తాజాగా కుమురం భీం జిల్లా కాగజ్‌నగర్ అడవుల్లో అటవీశాఖ అధికారులు ఏర్పాటుచేసిన కెమెరాకు చిక్కింది. ఇండియన్ మంట్‌జాక్ అనీ దీనిని పిలుస్తారు. ఆపద సమయాల్లో తోటి జీవుల్ని హెచ్చరించేలా ఇవి చేసే ధ్వనులు కుక్కలు మొరిగినట్లు ఉండటంతో ‘బార్కింగ్’ డీర్‌గా పేరొందాయి.
ఈ సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీ జంతుశాస్త్ర ఆచార్యుడు శ్రీనివాసులు మాట్లాడుతూ.. బార్కింగ్ డీర్ జనావాసాలకు అతి దూరంగా, దట్టమైన అడవుల్లోనే నివసిస్తుందన్నారు. దేశంలో పశ్చిమ కనుమల్లో, హిమాలయాల సమీపంలో వీటి జాడ ఉందన్నారు. 15 ఏళ్ల కిందట నల్లమల అడవుల్లో కనిపించాక తెలంగాణలో మరెక్కడా ఈ జాతి జింక ఉనికి లేదన్నారు. కాగజ్‌నగర్ అడవుల్లో తాజాగా ఈ జింక కనిపించడం పట్ల ఎఫ్‌డీవో విజయ్‌కుమార్, డీఆర్‌వో వేణుగోపాల్ హర్షం వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి: Pm Muchhinthal Tour: శ్రీరామానుజ సహస్రాబ్ది సమారోహ ఉత్సవాలకు ప్రధాని మోదీ