థర్మాకోల్‌తో తయారు చేసిన నాటు పడవల్లో ప్రమాదకరంగా వాగును దాటుతున్న వీరు కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా గుండి గ్రామానికి చెందిన విద్యార్థులు. ఆసిఫాబాద్‌కు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామం నుంచి నిత్యం జిల్లా కేంద్రానికి ప్రజలు, విద్యార్థులు రాకపోకలు సాగిస్తుంటారు. కుమురం భీం ప్రాజెక్టు నీళ్లతో పాటు ఇతర నదులను కలుపుకొని వచ్చే పెద్దవాగు ఇటీవల వర్షాలకు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఈ నీటి ప్రవాహంలోనే నలుగురు వ్యక్తులు థర్మాకోల్ సహాయంతో పిల్లలను, ప్రజలను ఎక్కించుకుని ప్రవాహ వేగానికి అనుగుణంగా తోస్తూ ఆ ఒడ్డు నుంచి ఈ ఒడ్డుకు చేరుతున్నారు. ఏ మాత్రం పట్టు తప్పినా నీటిలో కొట్టుకుపోయే ప్రమాదం ఉంది.
ఈ వంతెనకు 2012లో మూడు కోట్లతో టెండర్లు పిలిచి తర్వాత 11 కోట్లకు పెంచారు. అయినప్పటికీ నిర్మాణం ఇప్పటికీ పూర్తి కాలేదు. ఇప్పటికైనా పాలకులు అధికారులు పట్టించుకొని వంతెన పూర్తిచేయాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.
ఇదీ చూడండి : బాబాపూర్‌లో ఈత మొక్కలు నాటిన కలెక్టర్