ETV Bharat / state

Mesram tribals: 107 మంది కోడళ్లతో మెస్రం వంశీయుల పూజలు - నాగ దేవతకు ప్రత్యేక పూజలు

Mesram tribals: ఆదివాసీల తెగల్లో సంప్రదాయాలు చాలా చూడ ముచ్చటగా ఉంటాయి. ఒక్కో తెగ గిరిజనులు కొత్త కొత్తగా పద్ధతులు పాటిస్తుంటారు. నాగరిక సమాజానికి ఆ ఆచారాలు ఆసక్తిని కూడా కలిగిస్తుంటాయి. అలాంటి ఘటనే కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో జరిగింది.

Mesram tribals
మెస్రం వంశీయుల కొత్త కోడళ్ల భేటీ
author img

By

Published : May 17, 2022, 11:42 AM IST

Mesram tribals: కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లా జైనూరు మండలం దేవుగూడా ఉషేగాంలో మెస్రం వంశీయుల కొత్త కోడళ్ల భేటీ పూజా కార్యక్రమం ఘనంగా జరిగింది. ఇందులో కొత్తగా వివాహం చేసుకున్న మెస్రం వంశస్థుల 107 మంది కోడళ్లు పాల్గొన్నారు. వీరంతా తెల్లటి వస్త్రాలు ధరించి నాగదేవతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో తెలంగాణతో పాటు మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు.

కొత్త కోడలు నది నుంచి బిందెలో నీళ్లు తీసుకొని ఒకరి తర్వాత ఒకరు తలపై పెట్టుకుని తీసుకొచ్చి నాగదేవతకు అభిషేకం చేశారు. ఈ పూజల తరువాతే కొత్త కోడళ్లు మెస్రం వంశీయులుగా గుర్తింపు పొందుతారు. ఈ విధంగా పురాతనం కాలం నుంచి ఉంది. ఆడపడుచులు, అత్తమ్మలు, చిన్నారులు అందరూ పాల్గొని గిరిజన సంప్రదాయలతో ఆడిపాడారు. డెంసా నృత్యాలు చేస్తూ తమ వంశస్తుల దైవానికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ ఉట్నూర్ జిల్లా బాలికల అభివృద్ధి అధికారిణి జీసీడీవో మెస్రం ఛాయా లక్ష్మి కాంత్, గ్రామ పటేల్, సర్పంచ్‌, మెస్రం వంశస్థులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి: జీవచ్ఛవాలుగా మారిన బిడ్డలు.. ఆపన్నహస్తం కోసం ఎదురుచూపులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.