కొమురం భీం జిల్లా మదర్ మోడీ గ్రామంలో బుధవారం వనదేవతకు పూజా కార్యక్రమాలు నిర్వహించి..వనభోజనాలు ఏర్పాటు చేశారు. ఆ కార్యక్రమంలో సోయం జంగు అతిగా మద్యం సేవించి కుర్సంగా సురేష్, ఆత్రం బాపులతో వాగ్వాదానికి దిగాడు. తీవ్ర ఆగ్రహానికి లోనైన ఇద్దరు సోయం జంగుపై కర్రతో తలపై బలంగా కొట్టారు. దెబ్బ బలంగా తగలడం వల్ల జంగు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మృతుని కొడుకు సోయం బొజ్జరావు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీచూడండి: పంజాబీ కుటుంబం ఆత్మహత్యకు కారణాలేంటి ?