కుమురంభీం జిల్లా కాగజ్నగర్ పట్టణంలోని ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో కన్యకాపరమేశ్వరి దేవి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. శరన్నవరాత్రుల్లో భాగంగా రోజూ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తూ పూజలు చేస్తున్నారు. వేడుకలను పురస్కరించుకుని ఆలయ అధికారులు ఎనిమిదోరోజున చిన్నారుల చేత అమ్మవారి తొమ్మిది అవతారాలను వేయించారు.
బాలాత్రిపురసుందరి, గాయత్రిదేవి, అన్నపూర్ణ దేవి, వాసవి కన్యకాపరమేశ్వరి దేవి, లలితా దేవి, సరస్వతి దేవి, శ్రీమహాలక్ష్మీ దేవి, దుర్గా దేవి, మహిషాసురమర్దిని అవతారాల్లో చిన్నారులు భక్తులకు దర్శనమివ్వగా.. భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. కాగా అమ్మవారు దుర్గాదేవి అవతారంలో భక్తుల పూజలందుకుంది.
ఇదీ చదవండి: వర్గల్ సరస్వతి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు