రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం నుంచి వచ్చిన నిధులతో పనులు చేపడుతూ.. అభివృద్ధి తమ ఖాతాలో వేసుకుంటుందని ఎంపీ సోయం బాపురావు ఆరోపించారు. సిర్పూర్ నియోజకవర్గంలోని బెజ్జురు మండలం కృష్ణపల్లి వద్ద హై లెవల్ బ్రిడ్జ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసేందుకు వచ్చారు. ప్రోటోకాల్ ప్రకారం శిలాఫలకంపై తన పేరు లేకపోవటంతో దానిని తొలగించాలని డిమాండ్ చేశారు.
వత్తాసు పలుకుతున్నారు
అధికారులు తెరాస ప్రభుత్వానికి వత్తాసు పలుకుతున్నారని ధ్వజమెత్తిన ఆయన .. శిలాఫలకంపై పేర్లు ప్రోటోకాల్ ప్రకారం లేకపోవటంతో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో భాజపా నాయకులు శిలాఫలకాన్ని బండరాళ్లతో ధ్వంసం చేసేందుకు యత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు.