ETV Bharat / state

నియంత్రిత సాగు సదస్సులో పాల్గొన్న ఎమ్మెల్యే కోనేరు కోనప్ప

రాష్ట్ర ప్రభుత్వం  సూచించిన పంటలు సాగుచేసి రైతులు నష్టపోకుండా చూడాలన్న కేసీఆర్​ సంకల్పం రైతులకు అర్థమయ్యేలా చెప్పేందుకే అవగాహన సదస్సు ఏర్పాటు చేశామని సిర్పూర్​ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నారు. కుమురం భీం అసిఫాబాద్​ జిల్లా కౌటాల మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు.

MLA Koneru konappa Participated In Crop Plan Seminar
నియంత్రిత సాగు సదస్సులో పాల్గొన్న ఎమ్మెల్యే కోనేరు కోనప్ప
author img

By

Published : May 24, 2020, 5:14 PM IST

కుమురం భీం అసిఫాబాద్​ జిల్లా కౌటాల మండల కేంద్రంలో ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఆధ్వర్యంలో రైతులకు నియంత్రిత పంట సాగువిధానంపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో రైతులు నష్టపోకుండా ముఖ్యమంత్రి చేసిన ముందస్తు ఆలోచన రైతుల బాగు కోసమే అని ఎమ్మెల్యే కోనేరు కోనప్ప వ్యాఖ్యానించారు. ఈ అవగాహనా సదస్సులో పంటల ప్రణాళిక, రైతులు సాగు చేయాల్సిన పంటలు, మార్కెటింగ్, డిమాండ్​ ఉన్న పంటల గురించి రైతులకు అవగాహన కల్పించారు. రైతులంతా ఒకే రకమైన పంట వేయడం వల్ల నష్టాలు చవిచూడాల్సి వస్తుందని ఆయన అన్నారు. శాస్త్రవేత్తలతో చర్చించి, కూలంకషంగా అధ్యయనం చేసిన తర్వాతనే ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారని ఎమ్మెల్యే తెలిపారు.

ఇవీ చూడండి: గ్రేటర్​లో కొత్త ప్రాంతాల్లో పెరుగుతున్న కొవిడ్​ కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.