ETV Bharat / state

కాగజ్​నగర్​లో అనుమతులు లేని రిజిస్ట్రేషన్ల నిలిపివేత - land registration done after prior permissions from officers

తెలంగాణలో నూతన పురపాలక చట్టం ప్రకారం పురపాలక పరిధిలో ఎల్ఆర్ఎస్ అనుమతి ఉన్న ప్లాట్లకు, స్థలాలకు మాత్రమే రిజిస్ట్రేషన్లు చేయనున్నారు. ఈ మేరకు కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని ఆసిఫాబాద్ సబ్​రిజిస్ట్రేషన్ కార్యాలయంలో కాగజ్​నగర్ పురపాలికలో అనుమతులు లేని రిజిస్ట్రేషన్లు నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.

land registrations in kagaznagar stopped as no layout was permitted
కాగజ్​నగర్​లో అనుమతులు లేని రిజిస్ట్రేషన్ల నిలిపివేత
author img

By

Published : Jul 22, 2020, 3:10 PM IST

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త పురపాలక చట్టంతో అవినీతి అక్రమాలకు అడ్డుకట్ట వేయనుంది. క్రమబద్ధీకరణ అనుమతి లేకుండా ప్లాట్ల రిజిస్ట్రేషన్లు చేయకూడదని ఉన్నతాధికారుల నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చాయి. ఈ మేరకు కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని ఆసిఫాబాద్ సబ్​రిజిస్ట్రేషన్ కార్యాలయంలో కాగజ్​నగర్ పురపాలికలో అనుమతులు లేని రిజిస్ట్రేషన్లు నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.

నూతన చట్టం ప్రకారం పురపాలక పరిధిలోని రెండు ఎకరాల స్థలానికి ఎల్ఆర్ఎస్ అనుమతి కోసం కలెక్టర్, అంతకంటే ఎక్కువ భూమి ఉంటే హైదరాబాద్ టౌన్ ప్లానింగ్ విభాగం అధికారుల నుంచి అనుమతులు పొందాలని అధికారులు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో అలా అనుమతులు లేని లేఅవుట్ రిజిస్ట్రేషన్లను ప్రభుత్వం నిలిపివేసింది.

ఇదీ చూడండి: ప్రాజెక్టులకు నిధుల సమీకరణపై సీఎం కేసీఆర్ సమీక్ష

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.