కుమురంభీం జిల్లాలో లాక్డౌన్ నిబంధనలను కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు. జిల్లాలో లాక్డౌన్ అమలును ఎస్పీ వైవీఎస్ సుధీంద్ర పర్యవేక్షిస్తున్నారు. బుధవారం జిల్లాలోని సరిహద్దుల వద్ద చెక్‌పోస్టులను తనిఖీ చేశారు. సిర్పూర్ టి మండలంలోని వెంకట్రావ్ పేట, జక్కపూర్ గ్రామాల్లో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టులను తనిఖీ చేశారు.
అంతరాష్ట్ర రహదారిలో రాకపోకలు సాగిస్తున్న వాహనాల వివరాలు తెలుసుకున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి అకారణంగా వస్తున్న వారిని అనుమతించొద్దని సిబ్బందికి సూచించారు. అత్యవసర కారణాలతో వచ్చేవారిని ఈపాస్ కలిగి ఉండి కొవిడ్ నిబంధనలు పాటిస్తేనే అనుమతించాలని తెలిపారు.
ఇదీ చూడండి: పౌరసరఫరాల శాఖలో వ్యాక్సినేషన్ డ్రైవ్