కుమురం భీం జిల్లా కాగజ్నగర్ పట్టణంలో కాముని దహనం ఘనంగా నిర్వహించారు. డప్పు చప్పుళ్ల మధ్య ప్రత్యేక పూజలు చేసి కామదహనం చేపట్టారు. పట్టణంలోని హనుమాన్ ఆలయం వద్ద కట్టెలు, ఆవుపేడతో ప్రత్యేకంగా తయారుచేసిన పిడకలు పేర్చి కామదహనం నిర్వహించారు.
డప్పు చప్పుళ్ల మధ్య మహిళలు సాంప్రదాయ పూజలు చేశారు. కాముని దహనం చెట్టుపై కలశాలతో నీళ్లు చల్లారు. అలా చేయడం వల్ల కోరికలు అదుపులో ఉంటాయని స్థానికుల నమ్మకం. అనంతరం పెద్దలు, పిల్లలు పరస్పరం ఆనందోత్సాహాలతో శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
ఇదీ చదవండి: భక్తుల కొంగుబంగారం... వెంకటాపురం లక్ష్మీనరసింహుడు..