కుమురం భీం జిల్లా కాగజ్‌నగర్ పురపాలక సంఘం కార్యాలయంలో ఛైర్మన్ సద్దాం హుస్సేన్ అధ్యక్షతన బడ్జెట్ సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశానికి కలెక్టర్ రాహుల్ రాజ్ హాజరయ్యారు. తెలంగాణ పురపాలక సంఘం చట్టం 2019, సెక్షన్ 107, 108 ప్రకారం ఆదాయము, పొరుగు సేవల ఉద్యోగుల జీతాలు, పారిశుద్ధ్య నిర్వహణ రుణ వాయిదాల చెల్లింపులకు కేటాయించగా.. 10% నిధులను గ్రీన్ బడ్జెట్ కొరకు కేటాయించినట్లు ఛైర్మన్ సద్దాం హుస్సేన్ తెలిపారు. తప్పనిసరి పద్దులకు కేటాయింపులు పోను మిగులు బడ్జెట్, పురపాలిక సొంత నిధుల నుంచి... పురపాలికలో విలీనమైన ప్రాంతాలు, అభివృద్ధి చెందని ప్రాంతాల మౌలిక వసతుల కల్పనకు కేటాయిస్తామని వెల్లడించారు.
పురపాలిక సంఘానికి గల ఆదాయ వనరులు సమృద్ధిగా వాడుకుని ప్రభుత్వం నుంచి మంజూరయ్యే నిధులనును కలిపి అభివృద్ధికి బాటలు వేయాలని కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. పట్టణంలో పరిష్కారం కానీ సమస్యలు ఏమైనా ఉంటే తన దృష్టికి తీసుకురావాలని తెలిపారు. వార్డుకో ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేయాలని... ఈమేరకు ప్రభుత్వ స్థలాన్ని గుర్తించాలని, లేని పక్షంలో కొనుగోలు చేసి నిర్మాణాలు చేపట్టాలని ఆదేశించారు. పురపాలికలో తగినంత సిబ్బంది లేకపోవడంతో అభివృద్ధి కుంటుపడుతుందని పలువురు కౌన్సిలర్లు... జిల్లా పాలనాధికారి దృష్టికి తీసుకురాగా... త్వరలోనే పరిష్కరిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు.
ఇదీ చూడండి: కవ్వింపుగా వలవేసి... వేధించి ఉసురు తీసి