ETV Bharat / state

ఎమ్మెల్యేగా ఓడిపోయి ఎంపీగా గెలుస్తారా: ఇంద్రకరణ్​ - minister'

అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా ఓడిపోయిన వారు ఎంపీగా గెలుస్తారా అని ఎద్దేవా చేశారు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్​ రెడ్డి. కుమురం భీం ఆసిఫాబాద్​ జిల్లా కాగజ్​నగర్​ పట్టణంలో జరిగిన తెరాస ముఖ్యకార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు.

ఇంద్రకరణ్​ రెడ్డి
author img

By

Published : Apr 2, 2019, 8:01 PM IST

ఎమ్మెల్యేగా ఓడిపోయి ఎంపీగా గెలుస్తారా: ఇంద్రకరణ్​
లోక్​సభ జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల అనంతరం ఇచ్చిన వాగ్దానాలు నెరవేరుస్తామని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్ర కరణ్ రెడ్డి అన్నారు. కుమురం భీం ఆసిఫాబాద్​ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలో ఏర్పాటు చేసిన తెరాస ముఖ్యకార్యకర్తల సమావేశానికి హాజరయ్యారు. ఎమ్మెల్యేలుగా పోటీ చేసి ఓడిపోయిన వారు ఇప్పుడు ఎంపీలుగా గెలుస్తారా అంటూ ఎద్దేవా చేశారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడా లేవన్నారు. సీఎం కేసీఆర్​ 7న నిర్మల్​ వస్తున్నారని తెలిపారు. గులాబీ దళపతి పర్యటన విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఆదిలాబాద్​ తెరాస ఎంపీ అభ్యర్థి గోడెం నగేశ్​, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి:"దేశ రాజకీయ గమనాన్ని మారుస్తా: కేసీఆర్"

Intro:filename:

tg_adb_03_02_kzr_trs_karyakarthala_meeting_avb_c11

Body:లోక్ సభ జడ్పిటిసి ఎంపిటిసి ఎన్నికల అనంతరం ఇచ్చిన వాగ్దానాలు నెరవేరుస్తామని తెలంగాణ అటవీ న్యాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్ర కరణ్ రెడ్డి అన్నారు. కుమురం భీం జిల్లా కాగజ్ నగర్ పట్టణం వాసవి గార్డెన్ లో ఏర్పాటుచేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి ఐకె రెడ్డి మాట్లాడుతూ.. ఇప్పుడు వచ్చి ఓట్లు అడుగుతున్న నాయకులు అధికారంలో ఉన్నప్పుడు జిల్లాలో చేసిన అభివృద్ధి ఏమిటో చెప్పాలన్నారు. ఎమ్మెల్యేలు గా పోటీ చేసి ఓడిపోయిన వారు వారు ఇప్పుడు ఎంపీలు గా గెలుస్తారా అంటూ ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రభుత్వంలో కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడా లేవని అన్నారు. ప్రజలు తెరాసను గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని... మనం వెళ్లి వారిని అడగడమే తరువాయి అన్నారు. కార్యకర్తలందరు కూడా సైనుకుల్లా పనిచేసి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలో అధిక మెజారిటీతో గెలిపించిన విధంగానే ఎంపీ అభ్యర్థి గోడం నగేష్ ను కూడా అత్యధిక మెజారిటితో గెలిపించాలని కోరారు. ఎంపీ అభ్యర్థి గోడం నగేష్ మాట్లాడుతూ ఎంపీ మరియు ఎమ్మెల్యే జోడెడ్ల మాదిరిగా నడిస్తామని... ఎంపీ ఒక పార్టీ నుండి ఎమ్మెల్యే ఒకపార్టీ నుండి ఉంటే అభివృద్ధి జరగదని అన్నారు. కాబట్టి ప్రజలందరూ ఆలోచించి సరైన నిర్ణయం తీసుకొని తనను గెలిపోయించాలని కోరారు.

బైట్: మంత్రి : అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి

Conclusion:KIRAN KIMAR
SIRPUR KAGAZNAGAR
KIT NO 641

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.