ETV Bharat / state

ప్రభుత్వ భూ కబ్జాలను అడ్డుకోకుంటే ఉద్యమమే: హరీశ్​ బాబు

author img

By

Published : Sep 17, 2020, 2:34 PM IST

కుమురం భీం జిల్లా కాగజ్​నగర్ మండల పరిధిలోని ప్రభుత్వ భూముల కబ్జాలను వెంటనే అడ్డుకోవాలని సిర్పూర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంఛార్జీ డా.పాల్వాయి హరీశ్​ బాబు డిమాండ్ చేశాారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ఆయన హెచ్చరించారు.

ప్రభుత్వ భూ కబ్జాలను అడ్డుకోకుంటే ఉద్యమమే: హరీష్ బాబు

కుమురం భీం జిల్లా కాగజ్ నగర్ మండలంలో ప్రభుత్వ భూమిలో కబ్జాలు అడ్డుకోవాలని లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని సిర్పూర్ కాంగ్రెస్ ఇంఛార్జీ డా.పాల్వాయి హరీశ్​ బాబు హెచ్చరించారు. 2004లో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇళ్లు లేని పేదలకు మూడు విడతలుగా మండలంలోని బొరిగాం, చారిగాం శివారులో స్థలాలు కేటాయించారని గుర్తు చేశారు. ఆ సమయంలో అక్కడ ఎవరు ఇల్లు కట్టుకోలేదని... ఇప్పుడు ఆ భూముల ధరకు రెక్కలు పెరగడంతో దళారుల కన్నుపడిందని ఆయన మండిపడ్డారు.

లక్షల్లో సొమ్ము చేసుకుంటున్నారు..

భూమి హక్కు పత్రాలు పొందిన పేదల వద్ద నుంచి స్థలాలు కొని లక్షల్లో అమ్ముకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి కొంతమంది ఖాళీ స్థలాలను కబ్జాలు చేస్తున్నారని వివరించారు. ఈ విషయమై పాలనాధికారికి ఫిర్యాదు చేశామన్నారు. స్పందించిన పాలనాధికారి వెంటనే ప్రభుత్వ స్థలాలను పరిరక్షించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించినట్లు హరీశ్ పేర్కొన్నారు.

కోనేరు కోనప్ప హస్తం : హరీశ్​ బాబు

దీని వెనుక ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ప్రధాన అనుచరుల హస్తం ఉందన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సమగ్ర విచారణ చేపట్టి గతంలో ఇళ్ల స్థలాలు పొందిన పేదలకు స్థలాలు చూపించాలని డిమాండ్ చేశారు. మిగితా స్థలాన్ని అర్హులైన పేదలకు అందించాలన్నారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ఆయన హెచ్చరించారు.

విలేకర్లకూ ఇవ్వాలి..

కాగజ్​నగర్ పట్టణంలో పనిచేస్తున్న జర్నలిస్టులకు గతంలో కొంతమందికి ఇళ్ల స్థలాలు కేటాయించారని.. అప్పుడు స్థలాలు రాని జర్నలిస్టులకు సైతం ఇళ్ల స్థలాలు కేటాయించాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కొక్కిరాల విశ్వప్రసాద్ స్పష్టం చేశారు. సమావేశంలో పలువురు మాజీ కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఇవీ చూడండి : పార్లమెంటులో కేంద్రం ప్రకటనపై ఐఎంఏ ఆగ్రహం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.