కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం గోలేటిలో ప్రభుత్వం ఇచ్చిన భూమి కోసం లబ్ధిదారులు ధర్నా చేపట్టారు. తెలంగాణ అవతరించకముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన రెండెకరాల భూమిని ఇప్పుడు తెరాస ప్రభుత్వం హరరితహారంలో భాగంగా చెట్లు నాటేందుకు ఉపయోగించడం దారుణమన్నారు. పేద వారికిచ్చిన భూములను లాక్కోవడం ఏంటని ప్రశ్నిస్తూ... ధర్నాకి దిగారు.
అప్పడి ప్రభుత్వం తమకిచ్చిన భూమికి పట్టాలు కూడా ఇచ్చిందని తెలిపారు. ఆర్డీఓ, తహసీల్దార్ వచ్చేవరకు తాము నిరసనను ఆపమని స్సష్టం చేశారు.
వారు వచ్చి హరితహారం కార్యక్రమాన్ని ఆపితే తప్ప ధర్నా విరమించేది లేదని హెచ్చరించారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎస్ఐ రమేష్ ఘటనా స్థలికి చేరుకొని వారిని సముదాయించే ప్రయత్నం చేశారు. ఆర్డీఓతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇవ్వడంతో నిరసనకారులు ధర్నా విరమించుకున్నారు.
ఇవీ చూడండి: 'దేశంలోనే తెలంగాణ అతి తక్కువ పరీక్షలు చేస్తుంది'