కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌లో దివంగత నేత, సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే పాల్వాయి పురుషోత్తం రావు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. రావు 20వ వర్ధంతి సందర్భంగా ఆయన సతీమణి, మాజీ ఎమ్మెల్యే పాల్వాయి రాజ్యలక్ష్మి ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. పూలమాలలు వేసి, నివాళులు అర్పించారు. పట్టణంలోని నౌగాం బస్తీలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కుమురం భీం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు విశ్వప్రసాద్, ఆదిలాబాద్ జిల్లా మాజీ జడ్పీ ఛైర్పర్సన్ సిడం గణపతి, పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
ఇదీచూడండి: లాంచీ ప్రమాద ఘటనలో పర్యటకుల వివరాలివే...!