కుమురం భీం జిల్లాలో పెద్దపులి దాడులు అధికమవుతున్న నేపథ్యంలో అటవీ శాఖ అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉంటూ పులి కదలికల్ని గమనిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొందరు అటవీశాఖ అధికారులు అడవిలోకి వెళ్లి అక్కడి పరిసరాలను గమనించారు.
డీపీవో శాంతారాం, ఎఫ్ఆర్వో వేణుగోపాల్, ఎఫ్ఎస్వో ప్రభాకర్, మరో 5గురు టైగర్ ట్రాకర్లు.. పెంచికల్‌పేట మండలం నుంచి 10 కిలోమీటర్లు ప్రయాణించి గుండెపల్లి అడవుల్లోకి సోమవారం ఉదయం 8 గంటలకు చేరుకున్నారు. కర్రలు పట్టుకుని అడవిలోకి ప్రవేశించి అక్కడ ఏర్పాటు చేసిన కెమెరాల్లో చిప్‌ను మార్చారు.
అనంతరం పులులు, ఇతర వన్య ప్రాణులకు ఉన్న తాగునీటి వనరులను పరిశీలించారు. వన్యప్రాణులను పట్టుకోవడానికి వేటగాళ్లు ఏమైనా ఉచ్చులు పెట్టారా అని తనిఖీ చేసారు. పులి పాదముద్రలను చూసి, వాటికి అనుగుణంగా పరిసర గ్రామాల్లో ఉన్న అటవీ అధికారులను అప్రమత్తం చేశారు.
ఇదీ చదవండి: పచ్చిపాలతో ప్రమాదం.. బ్రసెల్లోసిస్ వ్యాధి వచ్చే అవకాశం!