కుమురం భీం జిల్లా కాగజ్ నగర్ పట్టణంలోని 30 వార్డుల్లో ఇంటింటికీ రాపిడ్ ఫీవర్ సర్వే కొనసాగుతోంది. మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మెప్మా, మున్సిపల్ సిబ్బందితో పాటు ఆశా కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి జ్వరం, దగ్గు, ఒళ్లు నొప్పులు, జలుబు వంటి లక్షణాలతో బాధపడుతున్న వారి వివరాలు నమోదు చేస్తున్నారు. అనంతరం వారికి మందులు పంపిణీ చేస్తున్నారు.
అన్ని వార్డుల్లో ఈ సర్వే కొనసాగుతోందని కమిషనర్ శ్రీనివాస్ తెలిపారు. ప్రతి ఒక్కరు సర్వే సిబ్బందికి సహకరించాలని కోరారు. కరోనా విజృంభణ నేపథ్యంలో లాక్డౌన్ నిబంధనలు పాటిస్తూ ఇంట్లోనే ఉండాలని సూచించారు.
ఇదీ చూడండి: తీవ్రరూపం దిశగా తౌక్టే తుఫాను