కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ డీఎస్పీ సత్యనారాయణ, ప్రభుత్వ న్యాయవాది ముస్కు రమణారెడ్డిని ఘనంగా సన్మానించారు. సమత కేసులో నిందితులకు ఉరిశిక్ష పడడంలో వారి కృషిని ఏఎస్పీ సుధీంద్ర ప్రశంసించారు.
సమతపై అత్యాచారం, హత్య జరిగిన నాటి నుంచి పోలీసుల స్పందించిన తీరుపై సర్వత్రా హర్షం, ప్రశంసలు వ్యక్తమయ్యాయని తెలిపారు. ఈ కేసులో పోలీసులు సరైన సాక్షాధారాలు సేకరించి, నిందితులను కోర్టులో హాజరుపరిచి, 67 రోజుల్లోనే శిక్ష పడేలా వ్యవహరించారని అభినందించారు.
ఇదీ చూడండి: రాష్ట్రంలో ఎన్నికలు ఏవైనా ప్రజలు తెరాస వైపే..