కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ పట్టణంలో అధికార తెరాసకు దీటుగా ప్రతిపక్షాలు, స్వతంత్ర అభ్యర్థులు ప్రచారంలో పోటీపడుతున్నారు. పలు పార్టీల ఇంఛార్జ్లు తమ అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తున్నారు. అధికారంలో ఉన్న తెరాస చేసిన అభివృద్ధి ఏమిటో చూపాలని ప్రతిపక్షం వారు అంటున్నారు.
కాంగ్రెస్ అభ్యర్థుల తరపున డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు ప్రచారం చేస్తుండగా.. భాజపా అభ్యర్థుల తరపున డాక్టర్ కొత్త పల్లి శ్రీనివాస్ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. నాలుగు చోట్ల తెదేపా పోటీచేస్తుంది. ఆ పార్టీ తరపున జిల్లా నేతలు.. ప్రచారానికి వస్తున్నారు.
24వ వార్డులో తెరాస నుంచి టికెట్ ఆశించి భంగపడ్డ బైరిశెట్టి రవికుమార్ స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచారు. ప్రధాన పార్టీలకు ధీటుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. తన గుర్తైన ఆపిల్ పండును పంపిణీ చేస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నాడు.
ఇవీ చూడండి: 'ముఖ్యమంత్రి కేసీఆర్.. దేవుళ్ల పేరు చెప్పి దోచేశారు'