ETV Bharat / state

పత్తికి రూ.15 వేల గిట్టుబాటు ధర కల్పించాలంటూ రైతుల రాస్తారోకో - తెలంగాణ తాజా వార్తలు

Cotton Farmers Protest : రైతు ఆరుగాలం శ్రమించి, ఎన్నో వ్యయప్రయాసలకోర్చి పండించిన పంటకు గిట్టుబాటు ధర అందని ద్రాక్షగానే మిగిలిపోతోంది. ఏటా పెట్టుబడుల వ్యయం పెరుగుతున్నా, ఆశించిన గిట్టుబాటు ధర లేదని ఆసిఫాబాద్ రైతులు పోరుబాట పట్టారు.తాము పండించిన పత్తి పంట క్వింటాల్​కు రూ.15 వేల గిట్టుబటు ధర కల్పించాలని రాస్తారోకో చేపట్టారు.

పత్తికి రూ.15 వేల గిట్టుబాటు ధర కల్పించాలంటూ రైతుల రాస్తారోకో

author img

By

Published : Dec 30, 2022, 10:51 PM IST

Cotton Farmers Protest : పండించిన పంటకు ప్రభుత్వం రూ.15 వేల గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ రైతు సంఘాల ఆధ్వర్యంలో ఆసిఫాబాద్ ప్రధాన రహదారిపై అన్నదాతలు రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా రాష్ట్రం ఏర్పడితే రైతుల సమస్యలు పరిష్కారమౌతాయని భావించామని.. పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించకుండా ప్రభుత్వాలు తమ జీవితాలతో చెలగాటమాడుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రైతు సమస్యలను పరిష్కరించాల్సిన ప్రజాప్రతినిధులు తమకు పట్టనట్లు వ్యవహరిస్తున్నారని వాపోయారు.

గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ రోడ్డెక్కినా.. జిల్లా కలెక్టర్ తమ వద్దకు వచ్చి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పలేని దీనస్థితిలో ఉన్నారన్నారు. ప్రభుత్వాలు రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించకపోతే రాబోయే రోజుల్లో పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఇప్పటికీ ప్రభుత్వం దిగిరాకపోతే రోడ్లపై వంటావార్పులతో ఆందోళన కార్యక్రమాలు చేపట్టి నిరసన తెలుపుతామని అన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పత్తికి రూ.15వేల గిట్టుబాటు ధర కల్పించాలని కోరారు.

పత్తికి గిట్టుబాటు ధర 15 వేల రూపాయలు కల్పించాలని రాస్తారోకో

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.