ETV Bharat / state

కాగజ్‌నగర్‌లో క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం

కాగజ్‌నగర్‌లో క్రికెట్‌ టోర్నమెంట్‌ను సిర్పూర్‌ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ప్రారంభించారు. పట్టణంలోని శిశు మందిర్ విద్యాలయం ప్రాంగణంలో ఈ టోర్నమెంట్‌ను నిర్వహించారు. విజేతకు రూ.30,000, రన్నర్ అప్‌కు రూ.15,000 నగదు బహుమతిగా ఇవ్వనున్నారు.

cricket-tournament-inaugurated-by-sirpur-mla-koneru-konappa-in-kagaznagar
కాగజ్‌నగర్‌లో క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం
author img

By

Published : Dec 20, 2020, 3:23 PM IST

కుమురం భీం జిల్లా కాగజ్ నగర్ పట్టణంలో కోనేరు ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కోల్ల ప్రశాంత్ స్మారక క్రికెట్ టోర్నమెంట్‌ను సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ప్రారంభించారు. పట్టణంలోని శిశు మందిర్ విద్యాలయ ప్రాంగణంలోని క్రీడా మైదానంలో ఈ టోర్నమెంట్ నిర్వహించారు. ఎమ్మెల్యే కోనేరు కోనప్ప టాస్ వేసి ఆటను షురూ చేశారు. పోటీలో తలపడనున్న ఇరు జట్లకు అభినందనలు తెలిపారు.

యువత క్రీడా స్ఫూర్తితో పోటీల్లో పాల్గొంటూ.. లక్ష్యాన్ని చేరుకోవాలన్నారు. పది రోజుల పాటు నిర్వహించనున్న ఈ టోర్నమెంట్‌లో 40 జట్లు పాల్గొంటుండగా.. విజేతకు రూ.30,000, రన్నర్ అప్‌కు రూ.15,000 నగదు బహుమతిగా ఇవ్వనున్నారు.

ఈ కార్యక్రమంలో కోనేరు ఛారిటబుల్ ట్రస్ట్ ఛైర్మన్ కోనేరు వంశీ, పురపాలక ఉపాధ్యక్షుడు రాచకొండ గిరీశ్, పట్టణ ఎస్‌హెచ్‌వో మోహన్ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: చిన్న మార్పులతోనే మేలైన ఆరోగ్యం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.