కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌లో సీపీఎం ఆధ్వర్యంలో పట్టణంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ముందు సత్యాగ్రహ దీక్ష నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం కరోనా నివారణలో విఫలమయిందని సీపీఎం నాయకులు విమర్శించారు. సామాన్యులకు సైతం కార్పొరేటు ఆస్పత్రుల్లో ఉచితంగా కరోనా వైద్యం అందించాలని డిమాండ్ చేశారు.
కాగజ్ నగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కనీస వసతులు కూడా లేవని… ప్రభుత్వం తక్షణమే స్పందించి సరైన సదుపాయాలు కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు ముంజం ఆనంద్, శ్రీనివాస్, చాపిలే సాయికృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: మహబూబాబాద్ జిల్లా చీకటాయపాలెంలో రోడ్డు ప్రమాదం