న్యూ డెమోక్రసీ పార్టీ నుంచి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పురపాలిక ఎన్నికల్లో పోటీ చేసిన నాగలక్ష్మి 9వ వార్డు కౌన్సిలర్‌గా నాగలక్ష్మి గెలుపొందారు. ఒకవైపు తెరాస అభ్యర్థులు హవాను కొనసాగిస్తున్నా.. ప్రతిపక్ష పార్టీ అభ్యర్థిగా వరుస విజయాన్ని సాధించారామె
హోటల్లో పనిచేస్తున్న కౌన్సిలర్..
ప్రజా ప్రతినిధిగా ఆమె జీవనం ఒకవైపైతే.. కుటుంబ పోషణ నిమిత్తం తమ కుటుంబం నిర్వహించే హోటల్లో తాను ఒక సభ్యురాలిగా పని చేయడం మరోవైపు. వార్డులోని సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తూనే మరో వైపు తన పని తాను చేయడం ఎంతో సంతోషంగా ఉందని నాగలక్ష్మి అంటోంది.
ఈరోజుల్లో వార్డు మెంబర్‌గా గెలిస్తేనే హంగులు ఆర్భాటాలు చేస్తుంటే..కౌన్సిలర్‌గా గెలిచిన నాగలక్ష్మీ... సాదాసీదాగా జీవిస్తూ అందరికి ఆదర్శనంగా నిలుస్తోంది.
ఇదీ చూడుండి: ఎన్నికలు ఏవైనా గెలుపు తెరాసదే: మంత్రి ఈటల