ETV Bharat / state

కాగితపు కోట.. కట్టుదిట్టం - lock down update

నెల రోజుల అనంతరం జిల్లాలో కరోనా వైరస్‌ బయటపడింది. జైనూరు, సిర్పూర్‌-యు మండలాల్లోని ఏడుగురు వ్యక్తులకు కొవిడ్‌ సోకగా వీరందరూ కోలుకొని డిశ్ఛార్జై ఇంటికి చేరుకున్నారు. కరోనా రహితంగా ఉన్న జిల్లాలో, ముంబయి నుంచి వచ్చిన ఇద్దరు వలస కార్మికులు కాగజ్‌నగర్‌కు రావడంతో రెండు కరోనా యాక్టివ్‌ కేసులు నమోదయ్యాయి. వీరిని కలిసిన 15 మంది ప్రైమరీ కాంటాక్ట్‌ వ్యక్తులను అధికారులు ఆసిఫాబాద్‌లోని ఐసోలేషన్‌ కేంద్రానికి తరలించారు.

corona prevention activities in kumuram bheem asifabad district
కాగితపు కోట.. కట్టుదిట్టం
author img

By

Published : May 26, 2020, 9:31 AM IST

ప్రిల్‌ 23న కుమురం భీం ఆసిఫాబాద్​ జిల్లాలో చివరి కరోనా కేసు నమోదైంది. మొత్తం ఏడు పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో చికిత్స అనంతరం వీరందరూ వ్యాధి నుంచి కోలుకున్నారు. మళ్లీ మే 24న అంటే 31 రోజుల అనంతరం కాగజ్‌నగర్‌లో దంపతులకు కరోనా అని తేలింది. పదేళ్ల క్రితం ఉపాధికి ముంబయి వెళ్లిన వీరు లాక్‌డౌన్‌తో ఉపాధి కరవై పట్టణానికి 23న చేరుకున్నారు. వీరిని ఆసిఫాబాద్‌ ఐసోలేషన్‌కు తరలించగా, పాజిటివ్‌ రిపోర్టు 24న వచ్చింది.

మరో అయిదుగురి గుర్తింపు...

ముంబయి నుంచి కాగజ్‌నగర్‌కు వచ్చిన మరో అయిదుగురు వలస కార్మికులను అధికారులు సర్వేలో భాగంగా గుర్తించి రక్త నమూనాలను ఆదిలాబాద్‌ రిమ్స్‌కు పంపించగా, అందరికీ నెగెటివ్‌ రిపోర్టు వచ్చింది. కరోనా వచ్చిన దంపతులను కలిసిన పట్టణంలోని 15 మందిని ఆసిఫాబాద్‌ ఐసోలేషన్‌కు తరలించారు. కాగజ్‌నగర్‌ పురపాలిక, రెవెన్యూ, పోలీసులు అప్రమత్తమయ్యారు. సోమవారం కాగజ్‌నగర్‌ పురపాలిక కమిషనర్‌ కె.శ్రీనివాస్‌, టీపీబీవో సాయికృష్ణ, ఇన్‌ఛార్జి శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ బంగారు శ్రీనివాస్‌, తహసీల్దార్‌ ప్రమోద్‌కుమార్‌, పోలీసుల ఆధ్వర్యంలో ఆ కాలనీ ఇరువైపులా నిర్బంధించారు.

అధికారుల ఆరా..

ముంబయి నుంచి వలస కూలీ దంపతులు ఎప్పుడు వచ్చారు? వారి ఇంటికి ఎవరెవరూ వచ్చి కలిశారనే విషయమై అధికారులు ఆరా తీస్తున్నారు. కరోనా పాజిటివ్‌ అని తెలవడంతో వీరి ఇంటికి ఇరువైపుల ఉన్న దాదాపు 15 మందిని అనుమానంతో ఆసిఫాబాద్‌ ఐసోలేషన్‌ కేంద్రానికి తరలించారు. 21న ఆ దంపతులు తమ కూతురు ఉంటున్న జగిత్యాలకు వెళ్లారు. 22న కాగజ్‌నగర్‌లోని స్వగృహానికి చేరుకున్నారు. అయితే వారు వచ్చిన బస్సు, బస్టాండ్‌ నుంచి ఇంటికి ఆటోలో వచ్చారు. వచ్చిన బస్సు, వివరాలను అధికారులు సేకరిస్తున్నారు.

ఇంటింటికీ వైద్య పరీక్షలు..

పట్టణంలో వైద్య బృందాలు ఇంటింటి పరీక్షలను నిర్వహిస్తున్నాయి. పట్టణంలో కరోనా వైరస్‌ వ్యాధి దంపతులిద్దరికి సోకగా రెండు రోజుల ముందే ఇంటింటికి ఆరోగ్య సిబ్బంది వెళ్లి కరోనా వ్యాధితో పాటు, ఇతర వ్యాధి ఉన్న వారి వివరాలు సేకరిస్తున్నారు. సాధారణ జ్వరం, దగ్గు జలుబుతో పాటు, మలేరియా, డెంగీ, వ్యాధులకు వెంటనే చికిత్స, అవసరమగు మాత్రలు అందజేస్తున్నారు. బెంగాళీలు అధికంగా ఉండే నేటి నుంచి వైద్య బృందాలు ఈజ్‌గాంలో వైద్యపరీక్షలు ప్రారంభించనున్నారు.

వైద్య పరీక్షలకు ప్రజలు సహకరించాలి

- కుమురం బాలు, జిల్లా వైద్యాధికారి

కాగజ్‌నగర్‌ పట్టణంలో 54 వైద్యబృందాల ఆధ్వర్యంలో ఇంటింటికీి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నాం. ఇప్పటివరకు 80 శాతం సర్వే పూర్తయింది. సాధారణ వ్యాధులు ఉన్న వారిని ఎనిమిది మందిని గుర్తించి వారికి వెంటనే చికిత్స అందించాం. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారికి పరీక్షలు నిర్వహిస్తూ పర్యవేక్షిస్తున్నాం. నేటి నుంచి ఈజ్‌గాంలో వైద్య పరీక్షలు ప్రారంభిస్తాం.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.