తెరాస ప్రభుత్వం కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తోందని ఎమ్మెల్యే కోనేరు కోనప్ప తెలిపారు. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్మించిన భవన నిర్మాణ కార్మిక సంఘం సమావేశంలో కార్మికులు తెరాసలో చేరారు. సంఘం నాయకులకు, కార్మికులకు ఎమ్మెల్యే... గులాబీ కండువా కప్పి సాదర స్వాగతం పలికారు.
గత ప్రభుత్వాలు కార్మికుల సంక్షేమాన్ని మరిచాయని ఎమ్మెల్యే విమర్శించారు. తెరాస ప్రభుత్వంపై నమ్మకం ఉంచి పార్టీలో చేరుతున్న కార్మికులకు ధన్యవాదాలు తెలిపారు. పట్టణంలో కార్మిక సంఘానికి భవనం లేదని నాయకులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా.. భవన నిర్మాణానికి అనువైన స్థలం కేటాయించి భవన నిర్మాణానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్మికులకు బీమా సదుపాయం కల్పిస్తామన్నారు. కార్మికులకు ఎటువంటి సమస్య వచ్చినా... తనను సంప్రదించాలని సూచించారు.