కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఉన్న ఏకైక పురపాలక సంఘమైన కాగజ్‌నగర్‌లో 2005-06 సంవత్సరం నుంచి ఇప్పటివరకు 631 ఫారాల ఆడిట్ పెండింగ్‌లో ఉన్నట్లు సామాజిక కార్యకర్త, ఆర్టీఐ యాక్టివిస్ట్ అష్రాఫ్ తెలిపారు. వీటన్నింటిని డ్రాప్ చేయాలని.. లేకపోతే నిధులు రికవరీ చేయాలంటూ ఆయన ఫిర్యాదు చేశారు.
రూ. 17.21 కోట్లు దుర్వినియోగం అయినట్లు డిస్ట్రిక్ట్ ఆడిట్ అధికారి అందించిన వివరాల ప్రకారం తెలిసిందని అష్రాఫ్ అన్నారు. నిధులు దుర్వినియోగం అవుతున్నా అధికారులు పట్టించుకోవట్లేదని ఆయన ఆరోపించారు. ఇప్పటికైనా అధికారులు దృష్టి సారించి.. నిధులు రికవరీ అయ్యేలా చూడాలని కోరారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రతిపక్షాలు నిధుల దుర్వినియోగంపై చర్చించి ఆ నిధులతో కాగజ్‌నగర్‌ను అభివృద్ధి చేయాలని కోరారు.
ఇదీ చూడండి: జూరాలకు పోటెత్తిన కృష్ణమ్మ... కొనసాగుతోన్న గోదావరి జలాల ఎత్తిపోత