సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా కోటి వృక్షార్చనలో భాగంగా కుమురం భీం జిల్లా కాగజ్ నగర్‌లో జిల్లా కలెక్టర్ మొక్కలు నాటారు. మున్సిపాలిటీ పరిధిలోని ఎల్లగౌడ్ తోటలో పాలకవర్గ సభ్యులతో కలిసి మొక్కలు నాటి తోటను పరిశీలించారు. తోట అభివృద్ధి పనులను కమిషనర్ శ్రీనివాస్ కలెక్టర్‌కు వివరించారు.

నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ సేవ కేంద్రాల్లో ఆధార్‌తో చరవాణి నంబర్ నమోదుకు రేషన్ కార్డు లబ్ధిదారులు ఎదుర్కొంటున్న సమస్యలను పలువురు కౌన్సిలర్లు ఆయనకు వివరించారు. వెంటనే ఈ సేవ కేంద్రాన్ని సందర్శించి సమస్య పరిష్కారం అయ్యేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఇదీ చదవండి: 'సీఎం నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలి'