ETV Bharat / state

రాష్ట్రంలో ఘనంగా ఛట్​పూజ వేడుకలు.. హుస్సేన్​సాగర్​ వద్ద ఆధ్యాత్మిక శోభ - Chatpuja celebrations at Hussain Sagar

Chhat Pooja celebrations hyderabad: ఉత్తర భారతీయులు ప్రతి సంవత్సరం జరుపుకునే ఛట్ పూజా సంబురాలు రాష్ట్రంలో కన్నులపండువగా జరిగాయి. రాష్ట్రంలో ఉంటున్న ఉత్తర భారతీయులు.. కుటుంబ సభ్యులతో కలిసి పూజలు చేశారు. హైదరాబాద్‌ హుస్సేన్‌ సాగర్‌ వద్ద సూర్యభగవానున్ని సూర్యాస్తమయ వేళ ఆరాధిస్తూ భక్తిభావం చాటుకున్నారు.

Chhat Pooja
Chhat Pooja
author img

By

Published : Oct 31, 2022, 3:56 PM IST

రాష్ట్రంలో ఘనంగా ఛట్​పూజ వేడుకలు.. హుస్సేన్​సాగర్​ వద్ద సంతరించుకున్న ఆధ్యాత్మిక శోభ

Chhat Pooja celebrations hyderabad: రాష్ట్రంలో ఉత్తర భారతీయుల పండుగైన ఛట్‌ పూజా వేడుకలు అట్టహాసంగా జరిగాయి. జైన్‌ సేవా సంఘం ఆధ్వర్యంలోహుస్సేన్‌సాగర్‌లో నిర్వహించిన ఉత్సవాలకు పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారు. మహిళలు ప్రత్యేక పూజలు చేశారు. సూర్యభగవానున్ని భక్తితో కొలిచారు. ఈ కార్యక్రమానికి సీఎస్​ సోమేశ్‌ కుమార్‌.. ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వేడుకల్లో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సతీమణి పాల్గొన్నారు.

ఛట్‌ పూజల సందర్భంగా నెక్లెస్ రోడ్‌లోని హుస్సేన్ సాగర్, ట్యాంక్ బండ్‌పైనున్న బతుకమ్మ ఘాట్‌లో తెలంగాణ- బీహార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సూర్య భగవానుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు. మట్టి కుండల్లో వండిన పదార్థాలను, వివిధ రకాల పండ్లను నైవేద్యంగా సమర్పించారు.

కార్తీక మాసం తొలి వారంలో సూర్యభగవానుడిని పూజించి.. సకల రోగాలు కనుమరుగవ్వాలని, సంపదలు కలగాలని ఆకాంక్షిస్తూ ఈ పూజలు నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ పండుగకు అన్ని ఏర్పాట్లు చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. విభిన్న సంస్కృతి, సాంప్రదాయాలకు నిలయమైన కాగజ్ నగర్ పట్టణంలో వివిధ రాష్ట్రాలకు చెందినవారు తమ పండుగలను ఘనంగా నిర్వహిస్తుంటారు.

ఈ నేపథ్యంలో కుమ్రంభీం జిల్లా కాగజ్ నగర్‌లో ఛట్‌ పూజలు వైభవంగా జరిగాయి. ఉత్తర ప్రదేశ్, బిహార్ రాష్ట్రాలకు చెందిన ప్రజలు.. క్రీడా మైదానంలోని కొలనుల్లో ప్రత్యేక పూజలు చేశారు. పిండి పదార్ధాలు, పండ్లను గంపలో తీసుకుని వచ్చి కుటుంబ సమేతంగా సాయంత్రంవేళ సూర్యుడిని ఆరాధించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.