మహారాష్ట్ర చంద్రపూర్ జిల్లాకు చెందిన 20 మంది వలస కూలీలు తెలంగాణ రాష్ట్రంలో చిక్కుకున్నారు. వీరందరూ నెల రోజుల కిందట ఖమ్మం జిల్లాకు మిరపకాయలు కోసేందుకు వచ్చారు. లాక్‌డౌన్ కారణంగా పనులను నిలిపివేయటం వల్ల అక్కడ నుంచి సొంత గ్రామానికి వెళ్లేందుకు రవాణా సౌకర్యాలు లేక తీవ్రఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఆశ్రయం కోసం సమీప గ్రామంలోకి వెళ్తే అక్కడి ప్రజలు వెలివేసినట్లు వెల్లడించారు. చేసేదేమిలేక గ్రామ పొలిమేరలో బిక్కుబిక్కుమంటూ జీవనం కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు. తినటానికి తిండి లేక ఎండకు అల్లాడిపోతున్నట్లు తెలిపారు. అధికారులు వెంటనే స్పందించి సొంత గ్రామానికి పంపించాలని కోరుతున్నారు.
ఇదీ చదవండీ... హైదరాబాద్‌లో 'దిల్లీ' కుదుపు.. జమాత్‌కు వెళ్లొచ్చిన వారే కారణం