కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జన్మదినం పురస్కరించుకుని భాజపా నాయకులు రక్తదాన శిబిరం నిర్వహించారు. పట్టణంలోని కిమ్స్ ఆస్పత్రిలో భాజపా నాయకులు డా. కొత్తపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో పలువురు భాజపా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని రక్తదానం చేశారు.
సేవ సప్తాహ కార్యక్రమంలో భాగంగా సెప్టెంబర్ 17 నుంచి 26 వరకు వివిధ సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు డా. కొత్తపల్లి శ్రీనివాస్ తెలిపారు. ప్రధానమంత్రి చెప్పిన సేవాహి సంఘటన్ అనే మాటను స్ఫూర్తిగా తీసుకుని మరిన్ని సేవ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చెప్పారు.అనంతరం రక్తదానం చేసిన వారికి గుర్తింపు పత్రాలు అందజేశారు.
ఇదీ చదవండి: కొవిడ్ వల్ల కొండెక్కిన ధరలు.. కొనాలంటే 'గుడ్లు' తేలేస్తున్నారు!