కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణం గుంటూరు కాలనీలోని కోనేరు కోనప్ప ఇంటికి వెళ్లారు ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య. ఇంటికి వచ్చిన అతిథికి సాదర స్వాగతం పలికారు కోనప్ప. కాగజ్ నగర్ పట్టణంలోని పలు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న కరోనా రోగులకు కోనేరు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కల్పిస్తున్న భోజన వసతి గురించి ఆయనను అడిగి తెలుసుకున్నారు.
లాక్డౌన్ అమలులో ఉన్నన్ని రోజులు కరోనా రోగులకు రెండు పూటలా పౌష్టికాహారరాన్ని అందజేస్తామని ఎమ్మెల్యే కోనేరు కోనప్ప తెలిపారు. ఇంటి వద్ద ఉండే చికిత్స పొందున్న బాధితులకు కూడా డ్రై ఫ్రూట్స్‌తో పాటు ఆహారాన్ని పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. రోజుకు సుమారు 200 మందికి పైగా భోజనాలు అందిస్తున్నట్లు వివరించారు. ఇంతటి విపత్కర పరిస్థితుల్లో కొవిడ్ రోగులకు భోజన వసతి కల్పించడం గొప్ప విషయమని కోనప్ప సేవలను కొనియాడారు ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య.
ఇదీ చదవండి: గాంధీలో కరోనా రోగులకు బలవర్ధక ఆహారం