కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో రథసప్తమి సందర్భంగా బాలేశ్వర ఆలయంలో రథోత్సవము, జాతర నిర్వహించారు. ఆసిఫాబాద్ పట్టణానికి దక్షిణాన ఉత్తర వాహిని పెద్దవాగు తీరాన బాలేశ్వరలయం నెలకొంది. రథసప్తమి దృష్ట్యా తొమ్మిది రోజులు బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు. స్వామి వారిని దర్శించుకునేందుకు చుట్టు పక్కగ్రామాల నుంచి భక్తులు తరలివస్తున్నారు.
ఆలయ పునర్నిర్మాణం, వాగు ప్రవాహానికి తట్టుకునేలా శాశ్వత రక్షణ చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. రాష్ట్ర దేవాదాయ శాఖకు విన్నవించినప్పటికీ ఫలితం లేదని... ఇప్పటికైనా దేవాదాయ శాఖ పట్టించుకోని ఆలయాన్ని అభివృద్ధి చేయాలని కోరుతున్నారు.
ఇదీ చూడండి: భజరంగీ భాయిజాన్ లాంటిదే.. ఈ 'పర్సన్ జిత్' కథ!