కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలోని స్థానిక సంతోష్ ఫంక్షన్ హాల్లో ఏఎస్పీ వైవీఎస్ సుధీంద్ర ఆధ్వర్యంలో గణేష్ నిమజ్జనం సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. నిమజ్జన కార్యక్రమంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ప్రభుత్వ యంత్రాంగం అన్ని చర్యలు తీసుకుంటోందని ఏఎస్పీ సుధీంద్ర తెలిపారు. ఏదైనా సమస్య ఉంటే అధికారుల దృష్టికి తీసుకు రావాలని నిర్వాహకులకు సూచించారు. కార్యక్రమంలో కాగజ్నగర్ తహసీల్దార్ వనజ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ తిరుపతి, పలువురు గణేశ్ మండపాల నిర్వాహకులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: 'హెల్మెట్ లేని ప్రయాణం- రాహుల్, గడ్కరీకి ఫైన్!