ETV Bharat / state

అధికారిణిపై దాడికి కోమటిరెడ్డి ఖండన

ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సోదరుడు కృష్ణ అటవీ అధికారిణిపై చేసిన దాడిని భువనగిరి ఎంపీ కొమటిరెడ్డి వెంకటరెడ్డి ఖండించారు. మరోసారి ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.

author img

By

Published : Jul 1, 2019, 5:02 PM IST

మరోసారి ఇలాంటివి జరగకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి : ఎంపీ వెంకట్ రెడ్డి

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్​ పట్టణంలో ఎఫ్ఆర్​ఓ అనితపై ఎమ్మెల్యే కోనేరు కొనప్ప సోదరుడు కృష్ణ చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి తెలిపారు. ప్రభుత్వ అధికారులు విధులు నిర్వహిస్తున్న సమయంలో తెరాస నాయకులు కర్రలతో విచక్షణారహితంగా దాడులకు పాల్పడడం దారుణమని స్పష్టం చేశారు.
బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న తెరాస నాయకులు ప్రభుత్వాధికారులపై దాడులకు పాల్పడం హేయమైన చర్యగా అభివర్ణించారు. ఇలాంటి దాడులను ఎదుర్కొనేందుకు అటవీశాఖ అధికారులకు ప్రభుత్వం ఆయుధాలు సమకూర్చాలని సూచించారు. ఇలాంటి దాడులు తిరిగి పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.

అటవీశాఖ అధికారులకు ప్రభుత్వం ఆయుధాలు సమకూర్చాలి : ఎంపీ కొమటిరెడ్డి

ఇవీ చూడండి : 'కేసీఆర్ మూఢనమ్మకాలతో... ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు'

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.