కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం గణేశ్‌పూర్ గ్రామంలో కొనసాగుతున్న పశువుల అక్రమ రవాణా గురించి అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. కొందరు అక్రమార్కులు పశువులను కర్కశంగా కబేళాలకు తరలిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
స్థానికుల ఫిర్యాదుకు స్పందించిన ఆసిఫాబాద్ జడ్పీ ఛైర్పర్సన్ కోవా లక్ష్మి.. వాంకిడి మండలం గణేశ్‌పూర్ గ్రామం వద్ద పశువుల అక్రమ రవాణాను అడ్డుకున్నారు. పశువులను, వాటిని తరలిస్తున్న వాహనాలను పోలీసులకు అప్పగించారు. ఆసిఫాబాద్ నుంచి అక్రమంగా పశువులను హైదరాబాద్‌కు తరలిస్తుంటే.. చెక్‌పోస్టుల వద్ద ఉన్న పోలీసులు ఏం చేస్తున్నారని కోవా లక్ష్మీ అధికారులను నిలదీశారు. ఇలాంటి సంఘటనలు పునరావృతమైతే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తామని హెచ్చరించారు.
- ఇదీ చూడండి రాష్ట్రంలో వెయ్యి దాటిన కరోనా మరణాలు