కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆశావర్కర్లు ఆందోళనకు దిగారు. తమ సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ వాలంటరీ కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నాను చేపట్టారు. ఆంధ్రప్రదేశ్లోని ఆశావర్కర్లకు కేటాయించినట్లే తమకు స్థిర వేతనాన్ని కల్పించాలని.. బకాయిపడ్డ వేతనాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండిః దక్షిణ భారత దేశంలో ఉగ్రదాడులకు కుట్ర!