కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సార్సాల దాడి ఘటనలో నిజనిర్ధరణ కోసం వచ్చిన తమను పోలీసులు చట్టవ్యతిరేకంగా అరెస్టు చేశారని పౌరహక్కుల సంఘం నేతలు ఆరోపించారు. సార్సాల గ్రామానికి వెళ్లిన పౌర హక్కుల సంఘం ప్రధాన కార్యదర్శి ఎన్.నారాయణ, సహాయ కార్యదర్శి మాదన కుమారస్వామి, ఉమ్మడి ఆదిలాబాద్ కో కన్వీనర్ సారయ్య, గోండ్వాన ఆదివాసీ ప్రజా సంఘం నాయకుడు సోయం చిన్నయ్యను పోలీసులు అదుపులోకి తీసుకుని ఇస్గాం పోలీస్ స్టేషన్కు తరలించారు. ప్రజలకోసం పనిచేస్తున్న నాయకులను నిర్బంధించడంపై హోంమంత్రి వివరణ ఇవ్వాలని పౌర హక్కుల సంఘం ప్రధాన కార్యదర్శి ఎన్. నారాయణ డిమాండ్ చేశారు.
ఇవీ చూడండి: ఎట్టకేలకు గాడినపడ్డ వాట్సాప్, ఇన్స్టా