సమత అత్యాచారం, హత్య కేసు నిందితులైన షేక్‌బాబు, షేక్ షాబోద్దిన్, షేక్ మగ్దుంలను ఉదయం ఆదిలాబాద్ జిల్లా జైలు నుంచి పోలీసులు ప్రత్యేక కోర్టుకు తరలించారు. పోలీసులు శనివారం దాఖలు చేసిన ఛార్జిషీట్‌కు కోర్టు ప్రత్యేక నంబరు కేటాయించింది.
నిందితుల తరఫున వాదించడానికి న్యాయవాదులెవరూ ముందుకురాలేదు. న్యాయవాదిని నియమించుకోవాలని సూచిస్తూ... కోర్టు రేపటి వరకు అవకాశం ఇచ్చింది. కేసుకు సంబంధించిన... అన్ని సాక్ష్యాలను కోర్టులో సమర్పించినట్లు ఆసిఫాబాద్ డీఎస్పీ సత్యానారాయణ వెల్లడించారు.
ఈ కేసులో నిందితుల తరఫున వాదించకూడదని ఇప్పటికే ఆదిలాబాద్ బార్ అసోసియేషన్ ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుంది. రేపు కూడా న్యాయవాదులు వాదించడానికి ముందుకురానట్లయితే... కోర్టే ఓ న్యాయవాదిని నియమించనుంది.
ఇదీ చూడండి: "బాధతో విలవిలలాడుతున్నా.. కనికరించ లేదు"