ETV Bharat / state

పేదింటిలో వికసించిన విద్యా కుసుమం.. రాష్ట్ర స్థాయిలో ర్యాంకు

చదువుకోవాలనే పట్టుదల ఉండాలే కానీ ఎలాంటి పరిస్థితులనైనా జయించవచ్చని నిరూపించింది కుమురం భీం జిల్లా కాగజ్​నగర్​కు చెందిన విద్యార్థిని కల్యాణి. నిరుపేద కుటుంబంలో పుట్టిన ఆమె.. అత్యుత్తమ మార్కులతో రాష్ట్ర స్థాయి ర్యాంక్​ సాధించింది. తన లాంటి ఎంతో మంది పేద విద్యార్థులకు ఆదర్శంగా నిలిచింది.

a student got state level rank at kagaznagar in asifabad district
పేదింటిలో వికసించిన విద్యా కుసుమం.. రాష్ట్ర స్థాయిలో ర్యాంకు
author img

By

Published : Jun 19, 2020, 11:13 AM IST

కుమురం భీం ఆసిఫాబాద్​ జిల్లా కాగజ్​నగర్ పట్టణానికి చెందిన కాట శేషగిరి, అనిత దంపతులకు ఇద్దరు కుమార్తెలు. చిన్న కూతురైన కల్యాణి ఇంటర్మీడియట్ ఎంపీసీలో 992 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో నిలిచింది.

కల్యాణి రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబర్చినందుకు ఆమె తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమెను చదివించిన మేధా ఛారిటబుల్ ట్రస్ట్ వారికి ధన్యవాదాలు తెలిపారు.

కల్యాణి పదో తరగతిలో 9.7 గ్రేడింగ్​తో ఉత్తమ ప్రతిభ కనబరిచినప్పటికీ.. ఉన్నత చదువులు చదివించేందుకు తల్లితండ్రులకు స్థోమత సరిపోలేదు. ఆ సమయంలో మేధా ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రతిభ పరీక్షల్లో పాల్గొని అగ్రస్థానంలో నిలిచింది. ఫలితంగా ట్రస్ట్ వారు కల్యాణిని హైదరాబాద్​లోని ఓ ప్రైవేట్​ కళాశాలలో ఎంపీసీ చదివించారు.

ఇదీచూడండి: సందిగ్ధం... ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలు ఉంటాయా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.