కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని ఐదు మండలాల్లో తుది విడత స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. జైనూర్ జడ్పీటీసీ ఏకగ్రీవం కాగా నాలుగు జడ్పీటీసీ స్థానాలు, 36 ఎంపీటీసీ స్థానాల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఐదు మండలాల్లో మొత్తం 84 వేల 725 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరి కోసం 187 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎండ వేడిమి కారణంగా ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద ఉదయం నుంచి ఓటర్లు బారులు తీరారు. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును వినియోగించుకునేందుకు యువతీయువకులు, మహిళలు, వృద్ధులు ఉత్సాహం కనబరుస్తున్నారు.
ఇవీ చూడండి: కొనసాగుతున్న స్థానిక సంస్థల తుదిదశ పోలింగ్