KTR on Electricity Bill in Telangana : వంద మీటర్ల లోతులో తమ పార్టీని పాతి పెట్టే సంగతి తరవాత చూసుకుందామని, ముందు వంద రోజుల్లో నెరవవేరుస్తామన్న హామీల అమలుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) దృష్టి సారించాలని బీఆర్ఎస్ కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్ సూచించారు. రేవంత్ కాంగ్రెస్ ఏక్ నాథ్ షిండేగా మారతారని ఆయన రక్తం అంతా బీజేపీదేనని వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి ఇక్కడ చోటా మోదీగా మారారని ఆరోపించారు. హైదరాబాద్, సికింద్రాబాద్ నియోజకవర్గాల సన్నాహక సమావేశంలో నేతలను ఉద్దేశించి కేటీఆర్ ప్రసంగించారు.
కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్ని అమలు చేసేదాకా విడిచి పెట్టం : కేటీఆర్
KTR Fire on CM Revanth Reddy : రెండున్నర దశాబ్దాలు పార్టీ నిలబడి రేవంత్ రెడ్డిలాంటి నాయకులను అధిగమించిందని కేటీఆర్ చెప్పారు. తెలంగాణ జెండాను ఎందుకు పాతి పెడుతారని కేటీఆర్(KTR) ప్రశ్నించారు. తెలంగాణ తెచ్చినందుకా లేక అభివృద్ధి చేసినందుకా అని అడిగారు. కాంగ్రెస్, బీజేపీలు పార్లమెంట్ ఎన్నికల తరవాత కలిసిపోతాయని అన్నారు. గతంలో అదాని గురించి అడ్డగోలుగా మాట్లాడిన రేవంత్ రెడ్డి ప్రస్తుతం ఒప్పందం చేసుకున్నారని విమర్శించారు. స్విట్జర్లాండ్‌లో రేవంత్ రెడ్డి అదానితో అలైబలై చేసుకున్నారని గుర్తు చేశారు. వారి ఇరువురి మధ్య జరిగిన ఒప్పందాల అసలు, లోగుట్టు బయటపెట్టాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
త్వరలోనే ఎమ్మెల్సీలతో కేసీఆర్ సమావేశం ఉంటుంది : కేటీఆర్
KTR on Congress Guarantees in Telangana : జనవరి నెల కరెంటు బిల్లులు ప్రజలు ఎవరూ కట్టవద్దని కేటీఆర్ పిలుపునిచ్చారు. ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఉచిత విద్యుత్తు పథకం గృహజ్యోతి హామీని నెరవేర్చే దాకా బిల్లులు కట్టొద్దని తెలిపారు. స్వయంగా ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేతలు చెప్పినట్లుగానే ఉచిత విద్యుత్ కోసం డిమాండ్ చేయాలని సూచించారు. కరెంటు బిల్లులు అడిగితే అధికారులకు ముఖ్యమంత్రి మాటలను చూపించాలని అన్నారు. సోనియా గాంధీ బిల్లు కడుతుందని ముఖ్యమంత్రి ఎన్నికల అప్పుడు చెప్పారని కేటీఆర్ పేర్కొన్నారు. కరెంటు బిల్లు ప్రతులను సోనియా గాంధీ ఇంటికి పంపించాలని ప్రజలకు చెప్పారు.
BRS Meeting Today : భాగ్యనగరంలో ఉన్న ప్రతి ఒక్క మీటర్‌కి గృహజ్యోతి పథకం కింద ఉచిత విద్యుత్తు అందించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఈ పథకాన్ని వెంటనే అమలు చేయాలని, అద్దె ఇంటిలో ఉన్నవారికి ఉచిత విద్యుత్ ఇవ్వాలని అన్నారు. మహాలక్ష్మి కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్క మహిళకు రూ.2500 వెంటనే ఇవ్వాలని కోరారు. ఇచ్చిన హామీలను తప్పించుకునేందుకు కాంగ్రెస్ చూస్తే వదిలిపెట్టే పరిస్థితి లేదని కేటీఆర్ తెలిపారు.
అధికారం ఉందని నోటికొచ్చినట్లు మాట్లాడటం సబబు కాదు : దానం నాగేందర్