ఖమ్మం జిల్లా ఏనుకూరు మండలంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఉదయాన్నే గ్రామాల్లో ఉపాధి హామీ పనులు చేస్తున్న కూలీల వద్దకు వెళ్లి ఓటేయాలని కోరుతున్నారు. వివిధ పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్ర అభ్యర్థులు వినూత్నంగా ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. ఏనుకూరులో స్వతంత్ర అభ్యర్థి ఉషారాణి తన గుర్తు అయిన యాపిల్‌ను కూలీలకు అందిస్తూ ఓటు వేయాలని కోరారు. టీటీఎల్ పేటలో జడ్పీటీసీ కాంగ్రెస్ అభ్యర్థి భూక్య పద్మ చేతి గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరారు.
ఇవీ చూడండి: నేటితో మొదటి విడత పరిషత్ ఎన్నికల ప్రచారం బంద్