ఖమ్మం జిల్లా మధిర మండలం నిదానపురంలో నూతనంగా నిర్మించిన చేసిన పంచాయతీ కార్యాలయాన్ని జడ్పీ ఛైర్మన్ కమల్‌రాజు, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ఛైర్మన్‌తో కలిసి ప్రారంభించారు. పల్లెసీమల అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఆయన అన్నారు.
మండలంలోని మాటూరుపేటలో రహదారి పనులకు శంకుస్థాపన చేశారు. గ్రామాల్లో ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ ఛైర్మన్ నాగేశ్వరరావు, ఎంపీపీ లలిత, సర్పంచ్ రావూరి శివనాగ కుమారి పాల్గొన్నారు.