ఇక నుంచి తాము విధి నిర్వహణలో మరింత ఉత్సాహంగా పని చేస్తామని... ఖమ్మం జిల్లా పంచాయతీరాజ్ ఉద్యోగ సంఘం నాయకుడు రవీంద్రనాథ్ అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు 30 శాతం ఫీట్‌మెంట్, 61 సంవత్సరాలకు వయోపరిమితి పెంపు పట్ల జిల్లాలో ఉద్యోగులు సంబురాలు చేసుకున్నారు.
ఖమ్మం జిల్లా పరిషత్ కార్యాలయం ఆవరణలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి... మిఠాయిలు తినిపించుకున్నారు. సంబురాల్లో జడ్పీ ఛైర్మన్ లింగాల కమల్‌రాజు పాల్గొని ఉద్యోగులకు శుభాకాంక్షలు తెలిపారు.
ఇదీ చదవండి: మిగతా రాష్ట్రాల కంటే తెలంగాణలోనే అద్భుతంగా..: హరీశ్‌రావు