ETV Bharat / state

నేడు ఉమ్మడి పది జిల్లాల నేతలతో షర్మిల సమావేశం

రాష్ట్రంలోని ఉమ్మడి పది జిల్లాల ముఖ్య నాయకులతో వైఎస్​ షర్మిల నేడు సమావేశం కానుంది. ఖమ్మం ఆత్మీయ సమ్మేళనం- బహిరంగసభ ఏర్పాట్లపై సమీక్షించనున్నారు. ఏప్రిల్ 9న ఖమ్మంలోని పెవిలియన్ మైదానంలో షర్మిల బహిరంగ సభకు పోలీసులు అనుమతి ఇచ్చారు.

Police permission for Sharmila's public meeting at khammam
నేడు ఉమ్మడి పది జిల్లాల నేతలతో షర్మిల సమావేశం
author img

By

Published : Mar 25, 2021, 9:56 AM IST

రాష్ట్రంలోని ఉమ్మడి పది జిల్లాల ముఖ్య నాయకులతో వైఎస్​ షర్మిల నేడు సమావేశం కానుంది. ఖమ్మం ఆత్మీయ సమ్మేళనం- బహిరంగసభ ఏర్పాట్లపై చర్చించనున్నారు. ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో ఈ సమావేశం జరుగనుంది.

వచ్చే నెల 9న ఖమ్మం వేదికగా వైఎస్​ షర్మిల నిర్వహించ తలపెట్టిన బహిరంగ సభకు పోలీసుల అనుమతి లభించింది. ఖమ్మంలోని పెవిలియన్ మైదానంలో నిర్వహించనున్న బహిరంగ సభకు ఖమ్మం నగర రెండో పట్టణ పోలీసులు అనుమతి ఇచ్చారు. ఆత్మీయ సమ్మేళనం పేరుతో నిర్వహించే సభకు ఏప్రిల్ 9న సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు బహిరంగ సభ నిర్వహించుకోవచ్చని తెలిపారు. 5 నుంచి 6 వేల మంది వరకు సభలో పాల్గొనేలా పూర్తిగా కొవిడ్ నిబంధనలు పాటించాలని పోలీసులు ఆంక్షలు విధించారు.

రాజకీయ పార్టీ నెలకొల్పేందుకు సిద్ధమవుతున్న షర్మిల... ఖమ్మం నుంచే శంఖారావం పూరిస్తారని ఆమె సన్నిహిత వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఖమ్మం బహిరంగ సభ వేదిక నుంచే పార్టీ ప్రకటన, విధి విధానాలు ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోనే తొలి బహిరంగ సభ ఖమ్మంలో జరగనుండటం రాజకీయంగానూ ప్రాధాన్యం సంతరించుకోనుంది.

ఇదీ చూడండి : యాదాద్రి ఆలయంలో గంట విద్యుద్దీపాల ప్రయోగాత్మక పరీక్ష

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.