స్పందించే హృదయం ఉండాలే కానీ ఎలాగైనా... సాయం చేయవచ్చని నిరూపిస్తున్నాడు ఖమ్మం జిల్లా కేంద్రానికి చెందిన ఓ యువకుడు. లాక్డౌన్ నేపథ్యంలో రోజు 1,000 మంది ఆకలి తీరుస్తూ... ముందుకు సాగుతున్నాడు. ఖమ్మం నగరంలో పేదలు ఆకలితో అలమటిస్తున్నారు. ఇది గమనించిన ఉపేందర్ తాను దాచుకున్న రూ. 46వేలతో కొందరికైనా... కడుపు నింపాలనుకున్నాడు. ఐదుగురు స్నేహితుల సాయంతో రోజూ... భోజనం సిద్ధం చేసి.. పేదల కడుపు నింపుతున్నాడు. 8రోజులుగా పలు కాలనీల్లో అన్నదానం చేస్తున్నాడు. యువకుడిని చూసి కొంత మంది దాతలు ముందుకు వచ్చారు. వారి సాయంతో లాక్డౌన్ అమలయ్యేంత వరకు పేదలకు ఆహారం అందిస్తానని ఉపేందర్ చెబుతున్నాడు.
ఇదీ చూడండి: భారత్కు ఏడీబీ 220 కోట్ల డాలర్ల సాయం